ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా, ఇంగ్లండ్(SA VS ENG) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. డకెట్ 24, స్మిత్ 0, రూట్ 37, హార్రీ బ్రూక్ 19, బట్లర్ 21, లివింగ్ స్టన్ 9, జెమీ ఓవర్టన్ 11, ఆర్చర్ 25, అదిల్ రషీద్ 02, షకీబ్ మహమ్మద్ 5 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 3, మడర్ 3, కేశవ్ మహరాజ్ 2, ఎంగిడి, రబాడ చెరో వికెట్ తీసుకున్నారు.
సౌతాఫ్రికి విజయానికి 180 పరుగులు కావాలి. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగనున్న ప్రొటీస్ జట్టు విజయం నల్లేరు మీద నడకలా కనిపిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ వెళ్లడం ఖాయమైంది. ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్.. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా సెమీస్ చేరుకున్నారు. మార్చి 9న ఫైనల్ చేరుకోనుంది.