Saturday, April 19, 2025
HomeఆటChampions Trophy: ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ

Champions Trophy: ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా విజయం.. సెమీస్‌లోకి ఎంట్రీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 29.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (27), ట్రిస్టన్ స్టబ్స్ (0) విఫలమైనా.. రాసీ వాన్ డెర్ డస్సెన్ (72), హెన్రీచ్ క్లాసెన్ (64) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే 2 వికెట్లు తీశాడు.

- Advertisement -

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాటర్లు సౌతాఫ్రికా బౌలర్ల ముందు తేలిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో అత్యధికంగా జో రూట్ 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ 25, బెన్ డకెట్ 24, జోస్ బట్లర్ 21, హ్యారీ బ్రూక్ 19 పరుగులు చేశారు. సౌతాఫ్రికా అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఎదుర్కోలేకపోయారు.

మార్కో జన్‌సన్, వియాన్ మల్డర్ చెరో 3 వికెట్లు తీశారు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడి, కగిసో రబాడా తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్ బీ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరాయి. గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు వెళ్లాయి. కాగా ఆదివారం జరిగే మ్యాచ్ తర్వాత ఎవరు ఎవరితో తలపడతారో క్లారిటీ వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News