SLBC టన్నెల్ ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించనున్నారు. ఈమేరకు షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాఫ్టర్‌లో వనపర్తికి వెళ్తారు. 11.30 గంటలకు వనపర్తిలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 12 గంటలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో సమావేశమవుతారు.
మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీతో పాటు రుణ మేళా, ఉద్యోగ మేళాలో పాల్గొంటారు. చివరగా సాయంత్రం 4.15 కు వనపర్తి నుంచి SLBC టన్నెల్(SLBC Tunnel) వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించనున్నారు.