Tuesday, March 4, 2025
Homeచిత్ర ప్రభKiran Abbavaram: ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్

Kiran Abbavaram: ప్రేక్షకులకు కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్

యువ హీరో కిరణ్‌ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన ‘క'(KA Movie) మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రూ.50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో కిరణ్ తర్వాతి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తన 10వ చిత్రంగా ‘దిల్ రూబా'(Dilruba)అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాకి విశ్వ క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా.. ర‌వి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇక సినిమాటోగ్రఫీగా డానియేల్ విశ్వాస్, ఎడిటర్‌గా ప్రవీణ్.కేఎల్, ప్రొడక్షన్ డిజైనర్‌ సుధీర్ పని చేస్తున్నారు. హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.

- Advertisement -

‘దిల్ రుబా’ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో మేకర్స్ బిజీగా ఉన్నారు. అయితే హీరో కిరణ్‌ అబ్బవరం ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి విడుదలైన వీడియోలు చూసి సినిమా జోనర్ ఏంటో గెస్ చేసిన వారికి సినిమాలో హీరో వాడిన కస్టమైజ్డ్‌ బైక్‌ను బహుమతిగా అందించనున్నట్లు తెలిపాడు. అంతేకాదు మూవీ ఫస్ట్ డే, ఫస్ట్ షో తనతో కలిసి చూసే అవకాశాన్ని పొందవచ్చన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News