కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు(VH) నివాసంలో మున్నూరు కాపు నేతల(Munnuru Kapu leaders) సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మంత్రివర్గంలోనూ చోటు కల్పించలేదని వాపోయారు. ఈ సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం(AICC) ఆగ్రహంగా ఉంది. ఈ భేటీపై నూతన కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన జరగాల్సిన సమావేశానిక ప్రతిపక్ష నేతలను ఆహ్వానించి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ కులగణనతో ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీంతో పార్టీ లైన్ దాటిన వారిపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ చర్యలకు దిగనుందనే చర్యలు స్పష్టంగా పంపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నూతన ఇంఛార్జ్‌గా రాహుల్ సన్నిహితురాలు మీనాక్షి నటరాజన్‌ను ఇంఛార్జ్‌గా నియమించారని.. ఇందులో భాగంగానే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా తీన్నార్ మల్లన్నను సస్పెండ్ చేశారని పేర్కొంటున్నారు.