రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 300 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ ఆడటం ద్వారా భారత్ తరపున 300 వన్డేలు ఆడిన ఏడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, అజారుద్దీన్ ఉన్నారు. ఓవరాల్‌గా 23వ ఆటగాడిగా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్‌లో 11 పరుగుల వద్ద కోహ్లీ ఔట్ అయ్యాడు. కోహ్లీ కొట్టిన బంతిని న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో కోహ్లీ సహా అందరూ షాక్ అయ్యారు. కాసేపటి తర్వాత తీవ్ర నిరాశతో విరాట్ విలియన్ బాట పట్టాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ఈ క్యాచ్ చూసి షాక్‌కు గురైంది.

300 వన్డేలు ఆడిన భారత ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ – 463 మ్యాచ్‌లు
ఎంఎస్ ధోని – 350 మ్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ – 344 మ్యాచ్‌లు
మహమ్మద్ అజారుద్దీన్ – 334 మ్యాచ్‌లు
సౌరవ్ గంగూలీ – 311 మ్యాచ్‌లు
యువరాజ్ సింగ్ – 304 మ్యాచ్‌లు
విరాట్ కోహ్లీ- 300 మ్యాచ్‌లు
