ఎస్ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel)లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు చేసిన సహాయక చర్యలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రుల బృందంతో కలిసి సొరంగంలోకి వెళ్లిన రేవంత్ రెడ్డి రెస్క్యూ ఆపరేషన్ గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందారు.