Monday, March 3, 2025
HomeఆటIPL 2025: ఐపీఎల్ టీమ్స్ ప్రాక్టీస్ సెష‌న్ల‌పై బీసీసీఐ ఆంక్ష‌లు

IPL 2025: ఐపీఎల్ టీమ్స్ ప్రాక్టీస్ సెష‌న్ల‌పై బీసీసీఐ ఆంక్ష‌లు

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెక్షన్లు మొదలుపెట్టాయి. అయితే ప్రాక్టీస్ సెషన్లపై బీసీసీఐ కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. మార్చి 22న డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది.

- Advertisement -

ఆంక్షలు ఇవే..

** ఒక్కో జ‌ట్టుకు ఏడు ప్రాక్టీస్ సెష‌న్స్ మాత్ర‌మే ఉంటాయి.

** రెండు వార్మప్ మ్యాచ్‌లు మాత్రమే అనుమతించబడతాయి.

** మ్యాచ్ ఉన్న రోజుల్లో స్టేడియాన్ని ప్రాక్టీస్ కోసం ఉప‌యోగించ‌రాదు.

** ఐపీఎల్ వేదిక‌ల‌లో ఇత‌ర టోర్నీల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి లేదు.

** ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రధాన స్క్వేర్‌లోని సైడ్ వికెట్‌లలో ఒకదానిపై జరగాలి.

** ఫ్ల‌డ్ లైట్ల కింద కేవ‌లం 3.30 గంట‌లు మాత్ర‌మే ప్రాక్టీస్‌కు అనుమ‌తి ఉంటుంది.

** ప్రాక్టీస్ మ్యాచ్‌లకు బీసీసీఐ నుంచి ముందస్తు రాతపూర్వక అనుమతి తీసుకోవాలి.

** సంబంధిత ఫ్రాంచైజీ సీజన్‌లో మొదటి హోమ్ మ్యాచ్‌కు ముందు నాలుగు రోజుల్లో ప్రధాన స్క్వేర్‌లో ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకూడదు.

** రెండు జ‌ట్లు ఒకేసారి ప్రాక్టీస్ చేయాల‌నుకుంటే సెష‌న్ల వారీగా అవ‌కాశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News