ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా(WorldWildlife Day) సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) గుజరాత్‌లోని గిర్ అడవుల్లో లయన్ సఫారీ చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు ఉన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అడవిలో లయన్ సఫారీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
- Advertisement -


అపురూపమైన జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని పేర్కొన్నారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి గర్వపడుతున్నట్లు వెల్లడించారు.

