Tuesday, March 4, 2025
Homeఫీచర్స్Ant: అయ్య బాబోయ్.. చీమ చరిత్ర ఇంత ఉందా.. తెలిస్తే షాక్ అవుతారు..!

Ant: అయ్య బాబోయ్.. చీమ చరిత్ర ఇంత ఉందా.. తెలిస్తే షాక్ అవుతారు..!

చీమలు (Ants) ప్రపంచంలో అత్యంత పురాతన జీవులలో ఒకటి. ఇదో అల్పజీవి అని మనందరం అనుకుంటాం. కానీ దీని చరిత్ర తెలిస్తే అలా అనుకోరు. ఈ చిన్న ప్రాణులు సుమారు 11.5 కోట్ల సంవత్సరాల క్రితం క్రిటేషియస్ కాలంలో ఉద్భవించాయని చెబుతారు. చీమలు హిమానీనద యుగం (Ice Age) నుండి నుంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇవి ఎన్నో ప్రళయాలను విజయవంతంగా జయించాయంట. చీమల చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చీమలు (Ants) “ఫార్మిసిడే” (Formicidae) కుటుంబానికి చెందిన సూక్ష్మజీవులు. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి, కొన్ని శతాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ, ప్రత్యేకమైన సామాజిక వ్యవస్థలను ఏర్పరచుకున్నాయి.

- Advertisement -

తాజాగా లభించిన చీమ శిలాజాన్ని బట్టి 47 మిలియన్‌ ఏళ్ల కిందట భారీ చీమలు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు మనం చీమల చరిత్ర గురించి తెలుసుకుందాం. అమెరికాలోని వయోమింగ్‌ రాష్ట్రంలో 47 మిలియన్‌ ఏళ్ల కిందట భారీ మాంసాహార చీమలు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూగ్రహంపై డైనోసార్లు అంతరించిపోయినా.. వాటితో కలిసి జీవించిన చీమ జాతులు మాత్రం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. చీమలకు సుదీర్ఘ చరిత్ర ఉందని చెబుతున్నారు.

మయన్మార్‌లో 99 మిలియన్‌ సంవత్సరాల క్రితం హెల్‌ యాంట్‌ పేరుతో జీవించిన చీమ నమూనాను గుర్తించారు. ఇదే క్రమంలో భూమిపై చీమల సంఖ్యపై హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం, జర్మనీలోని వుర్జ్‌బర్గ్‌లోని జూలియస్‌ మాక్సిమిలియన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు. ప్రపంచంలో సుమారు 12 వేల నుంచి 15 వేలకు పైగా రకాల చీమ జాతులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవి పక్షులు, క్షీరదాల కంటే చీమల బరువు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇది మానవుల బయోమాస్‌లో దాదాపు 20 శాతం ఉందంట.

చీమలు కందిరీగల నుంచి ఉద్భవించినట్టు పలు పరిశోధనల్లో తేలింది. పరిమాణంలో 0.07–2 అంగుళాల మధ్యలో ఉండే చీమలు అంటార్కిటికా, ఐస్‌ల్యాండ్, గ్రీన్‌ల్యాండ్‌ మినహా ప్రపంచంలోని ప్రతిచోట కనిపిస్తున్నాయి. మగ కారిమక్ చీమల జీవిత కాలం మూడేళ్లలోపు ఉంటుంది. చీమల్లో కూడా తేనెటీగల మాదిరిగానే రాణి చీమ ఉంటుందంట. రాణి ఫలదీకరణం చేసిన తర్వాత కాలక్రమేణా మిలియన్ల గుడ్లు పెట్టగలదు. అధికంగా కొన్ని రకాల చీమలు 1 నుంచి 3 సంవత్సరాలు బతుకుతాయి.. మరికొన్ని చీమలు అయితే కొన్ని నెలలు మాత్రమే బతుకుతాయంట. అయితే ఓ రాణి చీమ 30 ఏళ్లపాటు జీవిస్తుందంట. మారికోపా హార్వెస్టర్‌ చీమకు 12 తేనెటీగలు కలిసి కుట్టగలిగే సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనదిగా భావిస్తారు. చీమల్లో ఆశ్చర్యకరంగా రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి తన ఆహారం తీసుకోవడానికి, రెండోది ఇతర చీమలను పోషించడానికి ఉపయోగిస్తాయంట.

చీమలు తమ శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవని అంచనా. చీమలు ఒక సంవత్సర వ్యవధిలో 50 టన్నుల మట్టిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలిస్తుంది. ఇది ప్రకృతికి మేలు చేయడంలో వానపాముల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగిఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు చీమలకు ఊపిరితిత్తులు, సాధారణ శ్వాసకోశ వ్యవస్థ లేదు. ఇవి శరీరంలోని రంధ్రాల వ్యవస్థ ద్వారా శ్వాస పీల్చుకునేందుకు ఉపయోగిస్తాయి. అందుకే ఇవి నీటి అడుగులో 24 గంటల పాటు జీవించగలవంట. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News