Saturday, April 19, 2025
Homeచిత్ర ప్రభKedar: నిర్మాత మృతిలో కుట్ర లేదు.. దుబాయ్‌లో అంత్యక్రియలు పూర్తి

Kedar: నిర్మాత మృతిలో కుట్ర లేదు.. దుబాయ్‌లో అంత్యక్రియలు పూర్తి

టాలీవుడ్ నిర్మాత కేదార్‌(Kedar) ఇటీవల దుబాయ్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా పోస్టుమార్టం నిర్వహించిన దుబాయ్ పోలీసులు కేదార్ మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చారు. ఆయనది సహజ మరణమే అని పేర్కొన్నారు. అనంతరం భార్య రేఖావీణకు మృతదేహం అప్పగించారు. కానీ మృతదేహం భారత్‌కు తీసుకువస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే కారణంతో దుబాయ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

- Advertisement -

ఇదిలా ఉంటే కేదార్‌కు కొందరు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వారికి బినామీగా ఉండి వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ డబ్బులతో దుబాయ్‌లో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసేవాడని సమాచారం. దీంతో ఆయనకు డబ్బులు ఇచ్చిన వారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News