ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) ఫలితాలు ఖరారయ్యాయి. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్(Alapati Rajendra) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం(Perabathula Rajasekhar).. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులపై గెలుపొందారు. ఏడో రౌండ్ ముగిసేసరికి ఇద్దరి మధ్య 70వేల ఓట్ల వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇది పూర్తయితే మెజార్టీలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
ఈ విజయంపై పేరాబత్తుల స్పందిస్తూ.. ఇంత గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. కూటమి అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు ఓటు వేసి గెలిపించిన పట్టభద్రుల ఓటర్లకు కూడా ధన్యవాదాలు చెప్పారు.