ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) మరోసారి ఢిల్లీ వెళ్లనున్నార. ఈనెల 5, 6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారని సీఎంవో కార్యాలయం తెలిపింది. ఈమేరకు షెడ్యూల్ ప్రకటించింది. 5వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. అదే రోజు ప్రధాని మోదీ(PM Modi), హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రికి ఢిల్లీ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. 6వ తేదీ ఉదయం తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ పయనమవుతారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 7వ తేదీ ఉదయం అమరావతికి చేరుకుంటారు. అనంతరం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు.