Tuesday, March 4, 2025
HomeఆటIND vs AUS: సెమీస్‌లో టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్

IND vs AUS: సెమీస్‌లో టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా ఇవాళ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్-ఆస్ట్రేలియా(IND vs AUS) జట్లు తలపడుతున్నాయి. నువ్వానేనా అనే రీతిలో సాగనున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక న్యూజిలాండ్‌తో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ భారత్ కంటిన్యూ చేసింది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆస్ట్రేలియాపై 2023 వరల్డ్ కప్ ఫైనల్ ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఆసీస్ కూడా భారత్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా జరగనుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

ఆస్ట్రేలియా జట్టు: కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News