Tuesday, March 4, 2025
Homeనేషనల్PM Modi: జంతువులతో సరదాగా గడిపిన ప్రధాని మోడీ

PM Modi: జంతువులతో సరదాగా గడిపిన ప్రధాని మోడీ

గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ (PM Modi) రిలయన్స్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రమైన వంతారాను ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కుటుంబ సమేతంగా మోడీకి స్వాగతం పలికారు. అలాగే జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎమ్మారై, సీటీ స్కాన్‌, ఐసీయూ వంటి సదుపాయాలు కలిగిన పశువైద్య వన్యప్రాణుల ఆసుపత్రిని వీక్షించారు.

- Advertisement -

అనంతరం అనంత్‌ అంబానీతో కలిసి వంతారా మొత్తం తిరిగారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో సరదాగా గడిపారు. పులి, సింహాల పిల్లలకు పాలు తాగించారు. జిరాఫీలకు ఆహారం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News