Saturday, April 19, 2025
HomeఆటIND vs AUS : అదరగొట్టిన విరాట్.. ఆసీస్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ..!

IND vs AUS : అదరగొట్టిన విరాట్.. ఆసీస్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ..!

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్లోకి దూసుకుపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ సూపర్ విక్టరీని సాధించింది. విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. సెంచరీ మిస్ అయినా టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్ల నుంచి శుభారంభం లభించలేదు. గిల్ (8) పరుగులకే వెనుదిరిగాడు, ధాటిగా ఆడే క్రమంలో (28) రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. అయితే విరాట్, అయ్యర్లు టీమిండియాకు అండగా నిలబడ్డారు. విరాట్ కోహ్లీ (84) భారత్ కు విజయాన్ని ఖాయం చేయగా… శ్రేయస్ అయ్యర్ (45) రాణించాడు. చివర్లో కోహ్లీ అవుటైనా.. రాహుల్ (42) పరుగులు, హార్దిక్ పాండ్యా (28)తో విజృంభించడంతో టీమిండియాకు విజయం చేరువైంది.

- Advertisement -

కోహ్లీ నిలకడగా ఆడటంతో టీమిండియాకు సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే కోహ్లీ అవుటయ్యాక కాస్త ఉత్కంఠ రేగింది. భారత్ విజయం కోసం చివరి 4 ఓవర్లలో 28 పరుగులు అవసరం అయ్యాయి. ఓవర్‌కు 7 చొప్పున పరుగులు చేయాలి. క్రీజులో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఈ దశలో 47వ ఓవర్లో హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్ బాది ఒత్తిడిని తగ్గించాడు. ఆ ఓవర్లో భారత్ 16 పరుగులు రాబట్టింది. దాంతో భారత విజయ సమీకరణం.. 18 బంతుల్లో 12 పరుగులకు మారింది. 6 పరుగులు అవసరం అయిన సమయంలో హార్దిక్ పాండ్యా అవుటైనా పెద్దగా కష్టపడకుండానే మిగిలిన పరుగులను సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాథ్యూ షార్ట్ స్థానంలో జట్టులోకి వచ్చిన కూపర్ (0) డకౌట్ అయ్యాడు. అయితే హెడ్ హిట్టింగ్ మొదలు పెట్టాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. దాంతో ఆసీస్ ఓవర్‌కు 6 పరుగుల చొప్పున రన్‌రేట్‌ను మెయింటేన్ చేస్తూ ముందుకు సాగింది. అయితే వరుణ్ చక్రవర్తి డేంజరస్ హెడ్‌ను అవుట్ చేశాడు. అనంతరం మార్నస్ లబుషేన్ (29)తో కలిసి స్మిత్ జట్టును ముందుకు నడిపాడు. వీరిద్దరు నెమ్మదిగా ఆడారు. అయితే కీలక సమయంలో లబుషేన్ అవుటయ్యాడు. ఆ వెంటనే ఇంగ్లీస్ (11) కూడా పెవిలియన్‌కు చేరాడు.

అనంతరం స్మిత్, అలెక్స్ క్యారీలు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు సమయోచితంగా ఆడారు. 30 ఓవర్లు దాటాకా వీరిద్దరు హిట్టింగ్ చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా 300 పరుగులు చేసేలా కనిపించింది. అయితే స్మిత్‌ను షమీ అవుట్ చేశాడు. ఆ వెంటనే సిక్సర్ కొట్టి ఊపుమీద కనిపించిన మ్యాక్స్‌వెల్ (7)ను అక్షర్ పటేల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక చివర్లో అలెక్స్ క్యారీ అవుటవడంతో ఆస్ట్రేలియా 264 పరుగులకు పరిమితం అయ్యింది. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 3 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజాలకు చెరో రెండు వికెట్లు లభించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News