Thursday, March 6, 2025
HomeతెలంగాణPhone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇంటర్‌పోల్‌కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇంటర్‌పోల్‌కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరిని తెలంగాణకు తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా సీబీఐ నుంచి ఇంటర్‌పోల్‌(Interpol)కు రెడ్ కార్నర్ నోటీసులు అందాయి.

- Advertisement -

మరోవైపు వీరిద్దరు అమెరికా వదిలి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బెల్జియం లేదా కెనడాలో తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా ఇంటర్‌పోల్‌కు రెడ్ కార్నర్ నోటీసులు అందడంతో ఏ దేశంలో ఉన్నా సరే నిందితులను పట్టుకుని హైదరాబాద్‌ తీసుకురానున్నారు. వీరిద్దరు హైదరాబాద్ వచ్చాక ఈ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News