Thursday, March 6, 2025
Homeచిత్ర ప్రభSinger Kalpana: నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం

Singer Kalpana: నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం

ప్రముఖ సింగర్ కల్పన (Kalpana) ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నా వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు తీసుకోవడంతో కడుపు క్లీన్ చేశామన్నారు.

- Advertisement -

మరోవైపు ఈ కేసును కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కల్పన భర్తను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. జోల్‌ఫ్రెష్ అనే నిద్ర మాత్రలను అధికంగా తీసుకున్నట్లుగా గుర్తించారు. కల్పన పెద్ద కుమార్తె కేరళలో ఉంటున్నారని.. హైదరాబాద్‌ వచ్చేందుకు ఆమె నిరాకరించారన్నారు. దీంతో ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగి కల్పన నిద్ర మాత్రలు అధికంగా తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. వెంటనే అపార్ట్‌మెంట్ సెక్రటరీకి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోమన్నారని వెల్లడించారు. వారి ఫిర్యాదు మేరకు డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు చెప్పారు. వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యం నుంచి కోలుకోగానే స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News