మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా ‘లైలా'(Laila). విడుదలకు ముందే ఫుల్ కాంట్రవర్సీలు ఎదుర్కొంది. వైసీపీ అభిమానులు అయితే ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కాంట్రవర్సీల మధ్య వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా విశ్వక్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం రూ.5కోట్లు కూడా వసూలు చేయలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది.
ఇప్పుడీ మూవీ విడుదలై నెల కూడా కాకముందే ఓటీటీ(Laila OTT) స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. మార్చి 7 నుంచి ఆహా(Aha) వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ‘లైలా’తో ప్రేమలో పడండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మరి ఓటీటీ ప్రేక్షకులను అయినా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.