ఐఎండి అంచనాల ప్రకారం ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాబోవు మూడు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. భారీవర్షాలు, పిడుగుపాటు నేపధ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాబోవు 3 రోజుల వాతావరణ వివరాలు:-
శుక్రవారం : రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
శనివారం : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఆదివారం : రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
IMD: 3 రోజులపాటు విస్తారంగా వర్షాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES