Tuesday, April 22, 2025
HomeఆటSteve Smith: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్

Steve Smith: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(Steve Smith) అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం భారత్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా(Australia) ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స్మిత్ అత్యధిక స్కోర్ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మ్యాచ్ అనంతరం వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే టెస్ట్‌లు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని ప్రకటించడం ఆసీస్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది.

- Advertisement -

ఆస్ట్రేలియా తరపున అత్యంత విజయవంతమైన ఆటగాళ్ళలో ఒకరిగా స్మిత్ పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో ఆ జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా 2010లో వెస్టిండీస్‌పై లెగ్-స్పిన్నింగ్ ఆల్ రౌండర్‌గా అరంగేట్రం చేసిన స్మిత్.. 170 వన్డేలు ఆడి 43.28 సగటుతో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2015, 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్లలో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News