Thursday, March 6, 2025
HomeఆటSA vs NZ: రెండో సెమీస్‌.. భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్‌

SA vs NZ: రెండో సెమీస్‌.. భారీ స్కోర్ చేసిన న్యూజిలాండ్‌

ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా లాహోర్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మధ్య రెండో సెమీస్ మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌(SA vs NZ) జట్టు భారీ స్కోర్ చేసింది. తొలుత టాస్‌ గెలిచిన కివీస్ టీమ్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై ఎటాక్ ప్రారంభించింది. స్టార్ ప్లేయర్లు రచిన్ రవీంద్ర(108), కేన్ విలియమ్సన్(102) మరోసారి సెంచరీలతో రెచ్చిపోయారు. వీరిద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లతో దుమ్మరేపారు. ఇక చివర్లో డారిల్‌ మిచెల్‌ (49), గ్లెన్‌ ఫిలిప్స్‌ (49*) పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 362 సరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ఎంగిడి 3, రబాడా 2, మల్డర్‌ ఒక వికెట్‌ తీశారు.

- Advertisement -

ఇక 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగనున్న సౌతాఫ్రికా జట్టు ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఆ జట్టుకు ఉన్న సెమీస్ గండం నుంచి తప్పించుకుని ఫైనల్ చేరుతుందో.. లేదా కీలకమైన పోరులో మరోసారి ఇంటిదారి పడుతుందో కాసేపట్లో తేలిపోనుంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 9న జరిగే ఫైనల్‌లో భారత్‌ను ఢీకొట్టనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News