ఏపీ డిప్మూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కార్పొరేటర్‌కు తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) స్పందించారు. జగన్ కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ అని తాము అనలేమా అని కౌంటర్ ఇచ్చారు. ఇక జగన్‌ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అంటూ ఎద్దేవా చేశారు.
“సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈయన మాత్రం శాసనసభకు రాడు… తరచుగా బెంగళూరుకు వెళుతుంటాడు. మీరు ఏ విధంగా ప్రజా సమస్యలపై నిలబడతారో చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు… ఆ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి కదా. నువ్వు కోడికత్తికి ఎక్కువ… గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికీ తెలుసు కదా. నోరుంది కదా అని వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు” అంటూ నాదెండ్ల చురకలు అంటించారు.