Thursday, March 6, 2025
HomeAP జిల్లా వార్తలువైయస్ఆర్ కడపBest Rank: రాష్ట్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ర్యాంకింగ్ లో వైయస్ఆర్ జిల్లాకు రెండో స్థానం

Best Rank: రాష్ట్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ర్యాంకింగ్ లో వైయస్ఆర్ జిల్లాకు రెండో స్థానం

గ్రామ,పట్టణ స్థాయిలో వైద్యారోగ్య శాఖలో వైద్యాధికారులు,అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ.. ప్రజలకు సంతృప్త స్థాయిలో ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని పి.జి.ఆర్.ఎస్ హాలులో ఆరోగ్యశ్రీ, అనుబంధ ఆస్పత్రులు ,పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల వైద్యులతో ఆరోగ్య సూచికలు, వైద్య శాఖ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వైద్యాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని.. వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు.మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వ్యాధులు విజృంభించకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనిదీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

హెల్త్ సెంటర్ లలో ప్రస్తుత స్టేటస్ ఓపి,ఐపి, డెలివరీలు, ఇమ్యూనైజేషన్ వంటి రోజువారి డేటాను నమోదు చేయాలన్నారు. ప్రతి ఒక్క పీ.హెచ్.సి సెంటర్లోని వైద్యాధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలన్నారు. పీ.హెచ్.సి పరిధిలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించేలా పనిచేయాలన్నారు. వైద్యాధికారులు క్రమం తప్పకుండా ప్రతిరోజు విదులకు హాజరవుతూ క్రింది స్థాయి సిబ్బందిని కూడా సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రైమరీ హెల్త్ సెంటర్లు,అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఉత్తమమైన మౌలిక వసతుల సదుపాయాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ నిబద్దతతో తమ కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అందే వైద్య సేవలు, వైద్యాధికారుల పనితీరు, ఆరోగ్య కేంద్రాల్లో ఓపి ల నమోదు సంఖ్యను పెంచేలా చూడాలన్నారు. ప్రణాళికా ప్రకారం సుఖ ప్రసవాలు ఇమ్మునైజేషన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం, మాతృ, శిశు మరణాల సంఖ్యను తగ్గించడం, 104 వాహనాల షెడ్యూలు, తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ సేవలు,తదితర ఆరోగ్య సేవలపై వైద్యాధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఓపి, ఐపి,ల్యాబ్ టెస్ట్లు, డెలివరీ వంటి ఆరోగ్య సేవలలో A గ్రేడ్ సాధించి రాష్ట్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ర్యాంకింగ్ లో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పర్ఫామెన్స్ ఇండికేటర్స్ లో మంచి ప్రతిభ చూపిన వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యాధికారులు మూడు నెలల ప్లాన్ అఫ్ యాక్షన్ పైన పి పి టి ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే హెల్త్ ప్రోగ్రామ్స్ ప్రత్యేక దృష్టి సారించి వెనుకబడిన
పారామీటర్స్ లను మెరుగుపరుచు కోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News