ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లింది. లాహోర్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఫైనల్ కి చేరింది కివీస్. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోర్ చేసింది. 362 పరుగులు చేసింది. భారీ స్కోర్ లక్ష్యచేదనకు వచ్చిన దక్షిణాఫ్రికా 20 పరుగుల వద్దనే ఓపెనర్ ను కోల్పోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ని చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ బావుమా, వండర్ సన్ తీసుకున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరూ రెండో వికెట్ కి 105 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు.
బావుమా 56 పరుగులు, వండర్ సన్ 69 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఈ ఇద్దరూ స్లోగా ఆడటంతో విజయం ఆ టీం కి దూరమైంది. చివరలో డేవిడ్ మిల్లర్ సెంచరీ ఇన్నింగ్స్ విజయం కోసం పోరాడిన అది కూడా సరిపోలేదు. డేవిడ్ మిల్లర్ కు తన సహచరుల నుంచి సహకారం లేకపోవడంతో దక్షిణాఫ్రికా పరాజయం పాలయ్యింది. నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కెప్టెన్ మిట్చెల్ స్టార్క్ 3 వికెట్లు.. ఫిలిప్స్, హేన్రీ చెరో రెండు వికెట్లు తీసుకోగా బ్రెస్ట్ వెల్, రవీంద్ర చెరో వికెట్ సాధించారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారీగా పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలు చేయడంతో.. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) బౌండరీలతో హోరెత్తించారు. పటిష్టమైన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ఆడుకున్నారు. వీరికి గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్), డారెల్ మిచెల్ (49) అద్భుత సహకారాన్ని అందించారు.
దీంతో న్యూజిలాండ్ 362 పరుగులు చేసి న్యూజిలాండ్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఎంగిడి మూడు, రబాడా రెండు వికెట్లు పడగొట్టారు. ముల్దర్ ఒక వికెట్ తీశాడు. దీంతో న్యూజిలాండ్ ఫైనల్ కు చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ కు టీమిండియా చేరుకున్న విషయం తెలిసిందే. మార్చి 9న దుబాయ్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ కోసం ఈ రెండు జట్లూ అమీ తుమీ తేల్చుకోనుంది.