Friday, March 7, 2025
HomeదైవంCat : నల్ల పిల్లి ఏడుపు ఇంటికి అరిష్టమా, అదృష్టమా..? జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..!

Cat : నల్ల పిల్లి ఏడుపు ఇంటికి అరిష్టమా, అదృష్టమా..? జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..!

సాధారణంగా కొన్ని జంతువులు అదృష్టానికి సంకేతాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో వివిధ రకాల జంతువులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కొందరు కుక్క పిల్లలను.. మరికొందరు పిల్లులను, పక్షులను పెంచుతుంటాయి. అయితే వాటి శుభ, అశుభ సంకేతాలు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం. పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. జ్యోతిష్యంలో కొన్ని సంకేతాలను బట్టి శుభ, అశుభం కలుగుతుందంటారు.

- Advertisement -

ఈ కథనంలో పిల్లులకు సంబంధించి కొన్ని సంకేతాల గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రజలకు పిల్లుల విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఉదయాన్నే పిల్లిని చూడటం మంచి సంకేతమని చెబుతుంటారు. దీని వల్ల మీ ఇంటికి స్నేహితుడు లేదా అతిథి వస్తున్నారు లేదా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తారంటున్నారు. ఇక పిల్లి రంగు విషయంలో కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంట్లో తెల్ల పిల్లి ఉంటే అది మీకు మంచిదని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పిల్లి మీ ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు అలాంటి పిల్లిని పెంచడం వల్ల శుభవార్తలు, శుభ పరిణామాలు కూడా చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.

అయితే నల్ల పిల్లిని చాలా మంది అశుభంగా భావిస్తుంటారు. దీని కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవచ్చని చెబుతున్నారు. అందుకే నల్ల పిల్లులను పెంచడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లి ఏడుపు ఇంటికి మంచిది కాదంట. ఇలా పిల్లి ఏడుస్తుందంటే పనిలో ఆటంకాలు కలగవచ్చని అర్థమని చెబుతున్నారు. ఇక ఇంట్లో రెండు పిల్లులు పోట్లాడుకుంటుంటే ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయని అంటున్నారు.

అలాగే ఇంట్లో పిల్లి పిల్లికి జన్మనిస్తే.. అది మీకు చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా వివాహానికి ఆటంకాలు ఏర్పడినా సమస్యలన్నీ తొలగిపోయి త్వరలో ఆ ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయని పండితులు అంటున్నారు. (గమనిక: ఈ వార్తలో ఇచ్చిన సమాచారం జ్యోతిష్కులు వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రాసింది.. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News