Thursday, March 6, 2025
Homeనేషనల్PM Modi: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయంపై ప్రధాని మోదీ అభినందనలు

PM Modi: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయంపై ప్రధాని మోదీ అభినందనలు

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల విజయంపై ప్రధాని మోదీ(PM Modi) అభినందనలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీలో ఎన్డీయే అభ్యర్థుల విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశార.

- Advertisement -

“విజయాలు అందుకున్న ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి. తద్వారా రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళతాయి” అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) ధన్యవాదాలు తెలిపారు.

“ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఎన్డీయే కూటమి పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ మరెన్నో విజయాలు సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎన్డీయే ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను” అంటూ చంద్రబాబు వెల్లడించారు.

ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. బీజేపీ తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొందిన మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజతకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పనిచేస్తున్న తమ పార్టీ కార్యకర్తలను చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News