ఎండలు దంచికొడుతుండటంతో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు(Off day schools) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు బడులు నిర్వహిస్తారు. అయితే 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించనున్నారు.
అనంతరం అన్ని స్కూళ్లలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు(Summer holidays) ప్రకటించనున్నారు. కాగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.