Thursday, March 6, 2025
Homeటెక్ ప్లస్Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్!.. బంగారం ధర తగ్గింది..

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్!.. బంగారం ధర తగ్గింది..

కొత్త సంవత్సరం ప్రారంభంలో బంగారం ధరలు కొంతమేర మార్పు చెందాయి, అయితే ఫిబ్రవరి నెలలో ధరలు భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులు, పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించింది. ముఖ్యంగా, ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి, అయితే ఈ నెలలో కొంచెం తగ్గినట్లు కనపించింది. ఇది బంగారం కొనాలనుకున్నవారికి కొంత ఊరట ఇచ్చింది. అయితే, గత రెండు రోజుల నుంచి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

- Advertisement -

బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నెలలో పెరిగాయి. అయితే, మార్చి ప్రారంభంలో కొంతమేర తగ్గడం ఒక సంతోషకరమైన పరిణామం. మార్చి 4న 22 క్యారట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.8010గా ఉంది. అంటే, 10 గ్రాములకు ధర రూ.80100 వరకు చేరింది. అలాగే, 24 క్యారట్ల బంగారం ధర ఒక్క గ్రాముకు రూ.8738, 10 గ్రాములకు రూ.87380 గా ఉంది. కానీ మార్చి 5న ఈ ధరలు పెరిగాయి.

మార్చి 5న 22 క్యారట్ల బంగారం ధర రూ.55 పెరిగి రూ.8065 గా మారింది. అదే 24 క్యారట్ల బంగారం ధర రూ.60 పెరిగి రూ.8798 చేరింది. అంటే, 10 గ్రాములకు రూ.87980గా నమోదు అయ్యాయి.

ఈ రోజు, బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 22 క్యారట్ల బంగారం ధర రూ.45 తగ్గి ఒక్క గ్రాముకు రూ.8020గా ఉంది. 10 గ్రాములకు ధర రూ.80200గా నమోదైంది. అలాగే, 24 క్యారట్ల బంగారం ధర రూ.49 తగ్గి రూ.8749కు చేరింది, అంటే 10 గ్రాములకు రూ.87490.

నిపుణులు చెప్పినట్లు, కొనేవారు మరికొన్ని రోజులు ఓపికగా వేచి ఉండటం మంచిదని అంచనా వేస్తున్నారు. ఈ నెలలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News