Thursday, March 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు

Jagan: జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు

తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan)ను కర్ణాటక విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు కలిశారు. ఏప్రిల్ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వరస్వామి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ జగన్‌కు పీఠాధిపతులు ఆహ్వానపత్రికను అందజేశారు.

- Advertisement -

జగన్‌ను కలిసిన వారిలో పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ (నందీపుర), పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్లి), జడేశ్వర తాత (శక్తిపీఠం, వీరాపుర), కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్) ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్, అర్ధనారీశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ చైతన్య, కో ఫౌండర్ వీరేశ్ ఆచార్య కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News