బెంగళూరు సౌత్ సిటీ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(Tejasvi Surya) వివాహం ఘనంగా జరిగింది. చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, భరతనాట్య కళాకారిణిగా గుర్తింపు పొందిన శివశ్రీ స్కందప్రసాద్‌ను వివాహమాడారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం కనకపుర రోడ్డులోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కేంద్ర మంత్రులు వీ సోమన్న, అర్జున్ రామ్ మేఘ్వాల్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, మాజీ ఎంపీ ప్రతాప్ సింహా సహా అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.


కాగా 34 ఏళ్ల తేజస్వి సూర్య.. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన తేజస్వి.. 2019, 2024 ఎంపీ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.




