కాంగ్రెస్ పార్టీ సీనియత్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి(Jana Reddy) ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి వెళ్లే ముందు జానారెడ్డి నివాసానికి వెళ్లి మరీ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) తీవ్ర ఆరోపణలు చేస్తున్న క్రమంలో సీఎం ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ప్రభుత్వం అడిగితే సలహాలు ఇస్తానని జానారెడ్డి తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవిని ఆయనకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో కీలకమైన హోంశాఖ, ఆర్థిక, రెవెన్యూ వంటి శాఖలు నిర్వహించిన అనుభవం జానారెడ్డికి ఉంది. ఆయను అనుభవాన్ని పాలనలో వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. కాగా జానారెడ్డి కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఇద్దరు కుమారుల్లో రఘువీర్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా, జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.