ఎంతో మంది క్రికెట్ లెజెండ్స్ వెండితెరపై మెరిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన డేవిడ్ వార్నర్ సైతం.. నితిన్ రాబిన్ హుడ్ మూవీతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇక టీమిండియా ఆటగాడు మాజీ కెప్టెన్ దాదా కూడా త్వరలో తెరంగ్రేటం చేయనున్నాడు. అవును మీరు విన్నది నిజమే ఇప్పటికే బుల్లితెరపై యాంకర్ గా మెప్పించిన సౌరవ్ గంగూలీ.. త్వరలో వెండితెరపై కనిపించనున్నాడనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గంగూలీ ఆయన ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడట. పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో ఖాకీ డ్రెస్‌లో ఉన్న గంగూలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, జీత్, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఖాకీ ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2). ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో వేదికగా ఈ వెబ్ సిరీస్ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్‌సిరీస్‌లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.
ఇదే విషయమై ట్రైలర్ లాంచ్ లో నిర్మాత నీరజ్ పాండేను ప్రశ్నించగా.. మార్చి 20న వెబ్ సిరీస్ చూస్తే మీకే అర్థం అవుతుందని చెప్పారు. దీంతో కొందరు ఈ సిరీస్ లో గంగూలీ నటిస్తున్నాడని కొందరు అంటుండగా.. మరికొందరేమో ప్రమోషన్స్ లో భాగంగా గంగూలీ ఖాకీ డ్రెస్ వేసుకున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ IPS ఆఫీసర్ అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఖాకీ ది బిహార్ చాప్టర్ తెరకెక్కింది. 2022లో నెట్‌ఫ్లిక్స్ విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి కొనసాగింపుగా ఖాకీ 2 చిత్రీకరించారు.