Monday, March 10, 2025
HomeదైవంVastu Tips: ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించడం అశుభం.. విషాదం తప్పదంట..!

Vastu Tips: ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించడం అశుభం.. విషాదం తప్పదంట..!

వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు నేటికీ ఎంతో మంది ఉన్నారు. భారతీయ పురాతన శాస్త్రాల్లో ఇది కూడా ఒకటి. భవన నిర్మాణం, ఇంటి లోపలన నిర్మాణాలు శాస్త్రం ప్రకారం చేస్తే ఆ ఇంటికి ఎలాంటి విపత్తులు రావని నమ్ముతారు. ఈ హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఇంటిలోనూ దేవుని గది ఉంటుంది. దేవుడిని అక్కడ ప్రార్థిస్తారు.. దీని ద్వారా జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని భావిస్తారు. అయితే పూజ, దీపం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని సరిగ్గా పాటించక పోతే విషాదకర ఘటనలు జరిగే ప్రమాదం ఉందంటున్నారు వాస్తు నిపుణులు.

- Advertisement -

ఒక వ్యక్తి జీవితంలో నిరంతరం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటే.. అది వాస్తు లోపానికి సంకేతమని పండితులు చెబుతుంటారు. ఇంట్లో తప్పుడు దిశలో దీపం వెలిగించడం కూడా దీనికి కారణం అవుతుందని అంటున్నారు. వాస్తు దోషాలు రాకుండా ఉండాలంటే ఇంట్లో, ఆఫీసులో, షాపులో ఏ దిశలో దీపం వెలిగించాలో జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు ముందుగా దేవుని గది ఎక్కడ ఉండాలో నిర్ణయించాలంట.

నిజానికి ఈశాన్య దిశలో దేవుని గది ఉంటే బాగుంటుందని పండితులు చెబుతున్నారు. ఉదయించే సూర్యుని దిశలో భగవంతుని ప్రతిష్ఠ తూర్పు ముఖంగా ఉండాలి. దీపం వెలిగించడానికి తూర్పు దిక్కు కూడా అనువైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల నిర్మాణ లోపాలు తొలగిపోతాయంట. అంతేకాదు అనుకోని ప్రమాదాలను కూడా నివారించవచ్చని పండితులు అంటున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం వాస్తు దోషాలు అనేక విషాద సంఘటనలకు దారితీస్తాయి.

ఇంట్లోని దేవుని మందిరం వద్ద.. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం.. ఇది కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే ఇలాంటి ఘటనలు జరిగితే.. వెంటనే పండితులకు ఇంటిని చూపించి తగిన పరిష్కారం చేయాలని సూచిస్తున్నారు. ఇంట్లో రోజువారీ పూజ-ఆచారాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోని వాతావరణాన్ని సంతోషంగా ఉంచుతుంది. భార్యభర్తల మధ్య వివాదాలు రావు.. ఇక సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు.. (గమనిక: ఈ కథనం పండితులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News