ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన చేతికి సెలైన్ క్యాన్ పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. ఈ నేపథ్యంలో మరో మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) మాట్లాడుతూ.. నిమ్మల అన్నకు బాగోలేదని అయినా అసెంబ్లీకి వస్తున్నారని తెలిపారు. ఎంత చెప్పినా వినడం లేదని మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్షా అని విజ్ఞప్తి చేశారు. దాంతో స్పీకర్ స్థానంలో కూర్చుని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు.
రామానాయుడు పని రాక్షసుడు అని.. ప్రజాసేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండని చెప్పారు. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దని ఇది తన రూలింగ్ అని ఆదేశించారు. దీనికి బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రామానాయుడు పట్టుదల మనిషి అని తెలిపారు.