రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.శనివారం ఉదయం 10 గం.లకు ఉండవల్లి నుంచి బయలుదేరుతారు. 10:45: తర్లుపాడు రోడ్డులోని హెలీప్యాడ్ కు చేరుకుంటారు. 10:45 – 10:55: ప్రజాప్రతినిధులు, ఇతరుల నుంచి వినతులు స్వీకరిస్తారు.
10:55 – 11:15: ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష ఉంటుంది. 11:15: సభా వేదికకు పయనమౌతారు. 11:22: సభా వేదికకు చేరుకుంటారు. 12:20: స్టాల్స్ సందర్శన, రుణాల పంపిణీ, పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1 – 2:30: మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 2:35 – 4:05 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. 4:05 – 4:30: జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం తిరుగు పయనమౌతారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లను దాదాపుగా ఆ జిల్లా యంత్రాంగం పూర్తి చేస్తున్నట్లు సమాచారం.