Thursday, May 1, 2025
HomeదైవంTTD: అమరావతిలో మార్చి 14న శ్రీనివాస కళ్యాణం

TTD: అమరావతిలో మార్చి 14న శ్రీనివాస కళ్యాణం

ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో మార్చి 14వ తేదీన శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని టీటీడీ(TTD) ఈవో శ్యామల రావు(Shyamala Rao) తెలిపారు. ఈమేరకు శ్రీనివాస కళ్యాణం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలోని 25 ఎకరాల్లో శ్రీవారి ఆలయం నిర్మించామన్నారు. 2018లో ఆలయ నిర్మాణం ప్రారంభంకాగా 2022 జూన్ నెలలో పూర్తి చేశామని తెలిపారు. ఇక ఈనెల 14న ఆలయం పరిధిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కల్యాణోత్సవానికి దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. కళ్యాణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈమేరకు కళా బృందాలు, ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణ, అన్నప్రసాదాలు పంపిణీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) ముఖ్య అతిథిగా వస్తున్నారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News