Thursday, September 19, 2024
Homeహెల్త్Simple beauty tips: బ్యూటీ టిప్స్

Simple beauty tips: బ్యూటీ టిప్స్

 కొద్దిగా ఉప్పు, నిమ్మరసాలను కలిపిన నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు తలెత్తవు.

- Advertisement -

 నల్లద్రాక్ష గుజ్జులో కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే చర్మం నల్లబడదు.

 నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని నిత్యం వాడడం వల్ల వయసు పెరుగుతున్నా చర్మం ముడతలు పడదు. నిమ్మలో యాంటిసెప్టిక్ సుగుణాలు కూడా ఉండడం వల్ల చర్మం ఇన్ ఫెక్షన్ల బారిన పడదు.

 చేతివేళ్ల మీద వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అంటారు. వీటిపై కలబంద గుజ్జు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. కలబందలో ఉండే మేలిక్ ఆమ్లం పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

 శరీరంపై వచ్చే దద్దుర్లపై కర్పూరం నూనె రాసుకుంటే పోతాయి.

 ఎన్నో పోషకాలు, పీచుపదార్థాలు ఉన్న జామ పండు చర్మం ఎలాస్టిసిటీని కాపాడుతుంది. వయసుపైబడకముందే చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది కూడా.

 నీళ్లు ఎక్కువ తాగితే చర్మం మ్రుదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే నీరు బాగ ఉండే యాపిల్స్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, కమలాపండ్లు, ద్రాక్ష, కీర, టొమాటో వంటివి ఎక్కువగా తింటే చర్మం పట్టులా నునుపుగా, కాంతివంతంగా ఉంటుంది.

 బార్లీ నీళ్లు తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. అందులోనూ వేసవిలో బార్లీ నీళ్లు తాగడం శరీరానికి కూడా ఎంతో మంచిది.

 ముఖంపై ట్యాన్ అంటే నలుపుదనం ఉంటే టొమాటో ప్యాక్ వేసుకుంటే పోతుంది. తాజా టొమాటో తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై చక్కెర చల్లాలి. ఆ తర్వాత ఆ టొమాటో ముక్కలపై గడ్డ పెరుగు కొద్దిగా వేసి వాటితో ముఖంపై బాగా రుద్దుకోవాలి. టొమాటో ముక్కలతో ఇలా ముఖాన్ని రుద్దుకుంటే చర్మంపై ఉన్న మ్రుతకణాలు పోతాయి. అలాగే ముఖంపై పేరుకున్న నల్లదనం కూడా మెల్లగా పోతుంది.

 బెల్లంతో చేసిన పల్లీ ఉండలు తినడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. చర్మంపై ఏర్పడిన మచ్చలు కూడా పోతాయి.

 రోజూ ఉదయం, సాయంత్రం ఆముదం నూనెను ముఖానికి పట్టిస్తే చర్మంపై ఏర్పడ్డ నల్లదనం పోతుంది. అంతేకాదు కళ్ల కింద ఏర్పడిన నల్లని వలయాలు కూడా దీనివల్ల పోతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News