మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెక్షన్లు మొదలుపెట్టాయి. మార్చి 22న డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే మరో రెండు వారాల్లో ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టుకు భారీ షాక్ తగిలింది. వెన్నునొప్పి కారణంగా ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన స్టార్ బౌలర్ బూమ్రా (Jasprit Bumrah) కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దీంతో బుమ్రా ఐపీఎల్ మొదలైన రెండు వారాల పాటు జట్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీని ప్రకారం ముంబై ఆడనున్న తొలి 5 మ్యాచ్‌లకు బుమ్రా జట్టులో ఉండడు. ఇది ముంబై జట్టుకు నిజంగా షాక్ అనే చెప్పాలి. కాగా గత సీజన్లో ముంబై జట్టు అత్యంత ఫేలవమైన ప్రదర్శన కనబరిచింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రం విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం దక్కించుకుంది. ఇక ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించనున్నాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి హిట్ ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు.