Monday, March 10, 2025
HomeదైవంSrisailam: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం!

Srisailam: శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం!

ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల( Srisailam) క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు అత్యంత వైభవంగా స్వర్ణరథోత్సవం నిర్వహించారు ఆలయాధికారులు. భక్తుల కోలాటాలు, భజనలు, స్వామి వార్ల కీర్తనలతో ఆలయ ప్రాంగాణం మారుమ్రోగింది. ఆధ్మాత్మికతను పెంపొందించే విధంగా జరిగిన ఈ మహోత్సవం మంచి అనుభూతిని ఇచ్చిందని భక్తులు తెలిపారు.  

- Advertisement -

భక్తుల తాకిడి
వేకువజామున స్వామివారికి  మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్ణరథోత్సవం గంగాధర మండపం నుండి నందిమండపం వరకు విశేష భక్తి శ్రద్ధలతో రథయాత్ర కొనసాగింది. స్వామివారి రథాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు.  

భక్తులకు అరుదైన దృశ్యం
స్వామివారు స్వర్ణ రథంపై భక్తులను అనుగ్రహిస్తున్న దృశ్యం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. ఈ రథోత్సవం తిలకించడంపై ఆనందం వ్యక్తం చేశారు.  

కళా వైభవంతో రథోత్సవం
సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా  కోలాటం, జానపద నృత్యాలు, నామసంకీర్తన భజనలు, గిరిజన చెంచు నృత్యాలు నిర్వహించి భక్తులను ఆకట్టుకున్నాయి. విశేష భక్తి భావంతో భజన బృందాలు హరిహర నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమోగించాయి.  

ఈ మహోత్సవంలో  దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీయం. శ్రీనివాసరావు, అర్చకస్వాములు, వేదపండితులు, వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, శివ సేవకులు పాల్గొన్నారు. వారి సమన్వయంతో స్వర్ణరథోత్సవం అంత గొప్పగా నిర్వహించబడింది.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News