Monday, March 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Posani: మార్చి 20 వరకు పోసానికి రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు

Posani: మార్చి 20 వరకు పోసానికి రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు

వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళికి(Posani Krishna Murali) విజయవాడ ఛీప్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 20 వరకు రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ‌కల్యాణ్, మంత్రులు, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంపై జనసేన నేత శంకర్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పీటీ వారెంట్‌పై పోసానిని కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడ తీసుకువచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

- Advertisement -

విచారణ సందర్భంగా తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయమూర్తి ఎదుట పోసాని వాపోయారు. ఒకే అంశంపై కేసులు పెట్టి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని గుండె జబ్బు, పక్షవాతం లాంటి జబ్బులు ఉన్నాయని వివరించారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన నేపథ్యంలో పోసానిని మళ్లీ జైలుకు తరలించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News