ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఆదివారం ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఫైనల్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో.. న్యూజిలాండ్ జట్టు టీమిండియాను ఓడించి కప్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గంగూలీ 117 పరుగులు చేయగా న్యూజిలాండ్ ప్లేయర్ క్రిస్ కైర్న్స్ 102 పరుగులు చేశాడు. 25 ఏళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆదివారం అనే ఫోబియా క్రికెట్ ఫ్యాన్స్ కి అంటుకుంది. ముఖ్యంగా భారత అభిమానులు ఆదివారం నాకౌట్ పోరు అంటేనే భయపడుతున్నారు. ICC ట్రోఫీల్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో జరిగిన అన్ని ఫైనల్ మ్యాచ్ లలో భారత్ గెలిచింది. 1983 వరల్డ్ కప్ (శనివారం), 2002 ఛాంపియన్స్ ట్రోఫీ (సోమవారం), 2007 T20 వరల్డ్ కప్ (సోమవారం), 2011 వన్డే వరల్డ్ కప్ (శనివారం), 2013 ఛాంపియన్స్ ట్రోఫీ (సోమవారం), 2024 T20 వరల్డ్ కప్ (శనివారం) కప్పులు సొంతం చేసుకుంది.
మరోవైపు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 T20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 ODI వరల్డ్ కప్, 2023 ODI వరల్డ్ కప్ ఫైనల్స్ ఆదివారం జరగ్గా భారత్ ఓడిపోయింది. దీంతో భారత్ అభిమానులు ఆదివారం ఇండియా, న్యూజిలాండ్ ల మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై కొంతమంది భయం పెట్టుకున్నారు. అలాగే ప్రతి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదని మరికొందరు అభిమానులు అంటున్నారు.
టీమిండియాలో ప్రతి ప్లేయర్ ఫామ్ లో ఉన్నారని, బౌలింగ్ అలాగే బ్యాటింగ్ విభాగాల్లో స్ట్రాంగ్ ఉన్నారని, టాప్ బ్యాటర్లు త్వరగా ఔట్ అయినా మిడిలార్డర్ ప్లేయర్స్ నిలబడి మ్యాచ్‌ను గెలిపిస్తున్నారని అభిమానులు సోషల్ మీడియాలో అంటున్నారు. ఇంకొంతమంది దుబాయ్‌లో టీమిండియా అన్ని మ్యాచులను పకడ్బందీగా ఆడుతూ, స్ట్రాటజీలను అమలుపరుస్తూ సునాయాసంగా గెలుస్తుందని ఇలాంటి సమయంలో సండే ఫోబియా ఏమీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.