ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. ఇక భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలివడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ట్రోఫీని భారత్‌కు తెచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. టీమ్ఇండియా ప్లేయర్లను ప్రశంసించారు. టోర్నీలో ప్లేయర్లందరూ అద్భుతంగా ఆడారని కొనియాడారు. (ప్రధాని నరేంద్ర మోదీ)

ICC #చాంపియన్స్‌ట్రోఫీ2025లో అద్భుతమైన విజయాన్ని సాధించిన టీమ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు, మీ ఉజ్వలమైన శక్తి, మైదానంలో అప్రతిహత ఆధిపత్యం దేశాన్ని గర్వపడేలా చేసింది. క్రికెట్‌లో ఒక కొత్త ప్రమాణాన్ని స్థాపించారు. ( రాష్ట్రపతి ద్రౌపది ముర్ము)

అద్భుత విజయం.. కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేశాయి. ప్లేయర్ల అద్భుతమైన ప్రదర్శనలు, మైదానంలో జట్టు ఆధిపత్యం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అభినందనలు.
(రాహుల్ గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత)

ఛాంపియన్లకు అభినందనలు. దేశ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా పండుగ సీజన్‌ను మరింత రంగులమయంగా, ఆనందదాయకంగా మార్చిన భారత క్రికెట్ జట్టులోని ప్రతి ఆటగాడి పట్ల దేశం గర్విస్తోంది. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.. జై హింద్. (యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం)

ఎప్పుడూ ఓడిపోని దృఢ సంకల్పంతో ఉన్న న్యూజిలాండ్ జట్టుపై #ChampionsTrophy గెలుచుకున్న భారతదేశం అద్భుతమైన ప్రదర్శన చేసింది. గత సంవత్సరం @T20WorldCup విజయం తర్వాత వరుసగా @ICC పురుషుల ట్రోఫీలకు నాయకత్వం వహించిన రోహిత్ శర్మకు కూడా అభినందనలు. (జై షా, ఐసీసీ ఛైర్మన్)

ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న ఛాంపియన్స్ కి అభినందనలు. (సచిన్ టెండూల్కర్)

వీరితో పాటు ఎంతో మంది ప్రముఖులు, క్రీడాభిమానులు టీమిండియా ఆటగాళ్లను ప్రశంసిస్తున్నారు. టోర్నీలో ప్లేయర్లందరూ అద్భుతంగా ఆడారని కొనియాడుతున్నారు.