తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్(Group 1 Results) ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో మొత్తం 563 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 31, 382 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌షైట్ tspsc.gov.in. సందర్శించి ఫలితాలు తెలుసుకోవచ్చు. రీ వాల్యుయేషన్ కోసం వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం పేపర్‌కు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు అటెంట్ అవ్వాల్సి ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇక రేపు(మంగళవారం) గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నెల 20వ తేదీ లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు TGSPC ప్రకటించింది.