తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల(MLC Nominations) గడువు ముగిసింది. తెలంగాణలో 5 స్థానాలకు, ఏపీలో 5 స్థానాలకు గానూ మార్చి 2న నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కగా.. బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కింది. పొత్తులో భాగంగా 4 స్థానాల్లో ఒక సీటును సీపీఐకి కాంగ్రెస్‌కి కేటాయించింది. కాంగ్రెస్ తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ బరిలో ఉండగా.. సీపీఐ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ కుమార్ పోటీలో ఉన్నారు. వీరితోపాటు చలిక చంద్రశేఖర్, భోజరాజ్ కోయాల్కర్, జాజుల భాస్కర్, కంటే సాయన్నలు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.
మరోవైపు ఏపీలో కూటమి పార్టీలు 5 స్థానాలు దక్కాయి. అందులో ఒక స్థానాన్ని జనసేనకు, మరో స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. మిగిలిన మూడు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. టీడీపీ నుంచి కావాలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను ప్రకటించగా.. జనసేన తరపున కొణిదెల నాగబాబు, బీజేపీ తరపున సోము వీర్రాజు బరిలో ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి వీరంతా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.