ఢిల్లీ నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన సీనియర్ ఆర్మీ అధికారులు, ఐపిఎస్, ఐఆర్ఎస్ అధికారుల బృందం శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. ఈఎన్డీసీ బృందం ఈనెల 12 నుండి 17 వరకూ రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టుల పరిశీలన జరిపింది. పర్యటనలో భాగంగా చివరి రోజు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక, మున్సిపల్ పరిపాలన రంగాల్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల గురించి ఆయా శాఖల అధికారుల నుండి ఈ బృందం వివరాలు అడిగి తెలుసుకుంది.
ఈసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, కె.ప్రవీణ్ కుమార్,ముఖ్య కార్యదర్శి సునీత,కార్యదర్శి ప్రద్యుమ్న,పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన పాల్గొన్నారు.అదే విధంగా నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన ఫ్యాకల్టీ ఇన్చార్జి మేజర్ జనరల్ రాజేశ్ అరుణ్ మోఘే (Rajesh Arun Moghe) ఎస్డిఎస్, ఎయిర్ కమాండర్ కె.సుందర్ మని, బ్రిగేడియర్లు నవతేజ్ షోహాల్, అనూప్ కుమార్ మోహ్లా, వికాస్ స్లాతియా, నితిన్ భాటియా, రజత్ కుమార్, కల్నల్ అంగ్ కయా ధెట్ (Aung Kyaw Thet)(మయన్మార్), బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ షరీఫ్(మాల్దీవ్స్), కమాండర్ గౌతమ్ మార్వాహ(Gowtam Marwaha), కల్నల్ గౌరబ్ గురుంగ్ (Gaurab Gurung)(నేపాల్), సృజని మెహంతి (ఐఆర్ఎస్-ఐటి), ఎయిర్ కమాండర్ భగవత్, డిఐజి ఆశిస్ మెహరోత్రా(Ashis Mehrotra), బ్రిగేడియర్ గేవర్ధన్ సింగ్(Gaverdhan Singh)అశోక్ తివారి ఐపిఎస్, కల్నల్ కయిస్ విల్ మెర్కల్(Kiaus will Merkel) జర్మనీ, స్టాఫ్ లెప్నెంట్ కల్నల్ మోస్పర్ అబ్దుల్లా యం అలలినీ(Mosfer Abdullah M Alaliny) సౌదీ అరేబియా తదితరులు పాల్గొన్నారు.