ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) టీమ్‌ను ఐసీసీ(ICC) ప్రకటించింది. ఈ జట్టులో భారత్ జట్టు ఆరుగురి ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే టీమీండియా కెప్టెన్ రోహిత్ శర్మకు(Rohit Sharma) చోటు దక్కకపోవడం షాక్‌కు గురిచేసింది. ఈ టోర్నీలో తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టు ఓటమి లేకుండా కప్ సాధించాడు. అలాంటి రోహిత్ పేరు లేకపోవడంతో ఐసీసీపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక కెప్టెన్‌గా న్యూజిలాండ్ సారథి శాంట్నర్‌ను ఎంపిక చేసింది. అఫ్గానిస్తాన్ జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నుంచి ఒక ఆటగాడికి కూడా చోటు దక్కలేదు.
జట్టు: ఇబ్రహీం జద్రాన్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా, ఫిలిప్స్, కేఎల్ రాహుల్(కీపర్), శాంట్నర్(కెప్టెన్), వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, హెన్రీ, అక్షర్ పటేల్(12వ ఆటగాడు)