Monday, March 10, 2025
HomeతెలంగాణAirport: రామగుండంలో ఎయిర్‌పోర్టు సాధ్యం కాదు: కేంద్రం

Airport: రామగుండంలో ఎయిర్‌పోర్టు సాధ్యం కాదు: కేంద్రం

రామగుండంలో ఎయిర్‌పోర్టు పెట్టాలనే అంశంపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ(Vamshi Krishna) లేఖకు కేంద్ర విమానాయనశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(RamMohan Naidu)సమాధానమిచ్చారు. రామగుండంలో(Ramagundam) ఎయిర్ పోర్ట్ నిర్మాణం సాధ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. కొండప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల విమానాశ్రయం నిర్మాణం సాధ్యం కాదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపినట్లు చెప్పారు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నిరోధిత గగనతలంలో ఉందని, ఎయిర్ ఫోర్స్ అకాడమీ ద్వారా ఫ్లయింగ్ శిక్షణ కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుందన్నారు. దీంతో రక్షణ మంత్రిత్వ శాఖ నుండి క్లియరెన్స్ అవసరమని పేర్కొన్నారు.

- Advertisement -

ఇక భారత ప్రభుత్వం రూపొందించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్(GFA) పాలసీ ప్రకాకరం ఏదైనా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే తగిన స్థలాన్ని గుర్తించి, విమానాశ్రయ నిర్మాణానికి ముందస్తు సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలన్నారు. అనంతరం ‘సైట్ క్లియరెన్స్’ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించి, సూత్రప్రాయంగా ఆమోదం పొందాలని తెలిపారు. అయితే విమానాయాన మంత్రిత్వ శాఖకు రామగుండంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని గుర్తు చేశారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ఏదైనా ఎయిర్‌పోర్టు డెవలపర్స్, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినప్పుడు నిబంధనల ప్రకారం పరిగణించబడుతుందని లేఖలో వెల్లడించారు. కాగా రామగుండంలో డొమెస్టిక్ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాలని గతేడాది నవంబర్ లో కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ ప్రతిపాదన చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News