Wednesday, March 12, 2025
Homeటెక్ ప్లస్JioHotstar: గుడ్ న్యూస్.. రూ.100కే జియో కొత్త ప్లాన్

JioHotstar: గుడ్ న్యూస్.. రూ.100కే జియో కొత్త ప్లాన్

వినియోగదారులకు జియో కంపెనీ శుభవార్త అందించింది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. జియో హాట్‌స్టార్(JioHotstar) సబ్‌స్క్రిప్షన్‌ను అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.100తో 5GB హైస్పీడ్ డేటాతో పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల పాటు లభించనుంది. స్మార్ట్‌ఫోన్, టీవీల్లో 1080p రిజల్యూషన్ వరకు స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. అయితే ఇది కేవలం డేటా ప్యాక్ మాత్రమే ప్యాక్ కావడంతో ఈ ప్లాన్‌ను ఉపయోగించడానికి వినియోగదారులకు బేస్ ప్లాన్ ఉండాలి. ఇక 5GB డేటా అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి తగ్గిపోతుంది.

- Advertisement -

కాగా గత నెలలో జియో రూ.195కి హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 15GB డేటా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ మొబైల్‌కు మాత్రమే హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. టీవీలో కూడా స్ట్రీమింగ్ చేయాలనుకునే వారు రూ.100 ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News