గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) రిమాండ్‌ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు పొడిగించింది. ఈరోజుతో రిమాండ్ గడువు ముగియనుండటంతో వంశీని వర్చువల్‌గా జడ్డి ఎదుట జైలు అధికారులు ప్రవేశపెట్టారు. అనంతరం వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను కిడ్నాప్ చేసి, బెదిరింపులకు దిగిన కేసులో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులను కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. తమకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023లో గన్నవర టీడీపీ కార్యాలయంపై దాడి సంచలనం సృష్టించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు విచారణలో వేగం పెరిగింది.